శేరిలింగంపల్లి లో TRS పార్టీ రోజు రోజుకి బలపడుతుందా ???


16-JAN-2016: శేరిలింగంపల్లి లో తెరాస పార్టీ రోజు రోజుకి బలపడుతుందా  అంటే అవుననే సమాదానలే వినిపిస్తున్నాయి . ముక్యంగా కొండకల్ శంకేర్ గౌడ్ మరణం శేరిలింగంపల్లి తెరాస పార్టీ ని ఒక్క కుదుపు కుదిపింది కాని 2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కొమరోగొని శంకేర్ గౌడ్  చేరికతో కొంత ఊరట లబించింది.  TDPలో కచ్చితంగా గెలుస్తామనుకొని చాల మంది నాయకులూ టికెట్ ఆశింశారు అందులో ప్రదానంగా చెప్పుకోదగ్గ నాయకులు  ప్రస్తుత తెరాస నాయకులు మొవ్వ , ప్రస్తుత MLA గాంధీ , ప్రస్తుత తెరాస ఇన్ఛార్జ్ కొమరగోని శంకేర్ గౌడ్, బండి రమేష్. ఈ నలుగుర్లో గాంధీ కి టికెట్ లభించగా శంకేర్ గౌడ్ TRS లో టికెట్ తెచ్చుకున్నారు . అందరు ముందుగ ఊహించిన విధంగానే ఇక్కడ గాంధీ TDP తరపున అత్యదిక మెజారిటీ తో గెలవడం జరిగింది.



ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని పరిస్తుతులు తెరాసకి అనుకూలంగా మారడంతో ఎంతో మంది TDP మరియు కాంగ్రెస్ నాయకులు తెరాస లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ కాంగ్రెస్ లో మంచి పట్టు ఉన్న నేత రాగం నాగేందర్ యాదవ్ మరియు సుజాత యాదవ్ దంపతులు  2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ని వీడి తెరాసలో చేరడం జరిగింది. రాగం చేరికతో తెరాస పార్టీ లింగంపల్లి లో బాగా పుంజుకుంది.


    ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వర్ రావు తెరాసలో చేరారో  అప్పటి నుండి మొవ్వ కూడా తెరాస లో చేరికఫై  బాగానే ఆలోచించారు కాని TDP విడిచి వెళ్ళలేక అంటి ముట్టనట్లుగ ఉన్నారు. చివరిగా మొవ్వ 2015 లో తెరాస లో చేరారు. మొవ్వ చేరిక తెరాస పార్టీకి ఏంతో  బలాన్ని ఇచ్చింది. మొవ్వకి TDP కార్యకర్తల్లో మంచి పేరు ఉంది మరీయు 2009 లో కొద్ది లో MLA అవకాశం కోల్పోయాడు అన్న సింపతి కూడా ఉంది ఇదంతా TRS పార్టీ కి వచ్చే GHMC ఎన్నికలలో ఏంతో ఉపయోగపడుతుంది .


                       గత రెండు నెలల నుంచి GHMC ఎన్నికలలో  గెలుపు కోసం తీవ్రంగా  కష్టపడుతున్న మొవ్వ కి తోడుగా కాంగ్రెస్ నేత జగదీశ్ గౌడ్ కూడా TRS పార్టీ తీర్థం పుచ్చుకోవడం తో పార్టీ బలపడింది అని బావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ లో మంచి పట్టు ఉన్న జదీష్ గౌడ్ తెరాస లో చేరడం ఎవ్వరికి ఊహకందని విషయం. 2019 ఎన్నికల్లో జగదీశ్ గౌడ్ కాంగ్రెస్ టికెట్ కోసం ఏంటో ప్రయత్నించారు. జగదీశ్ గౌడ్ కి శేరిలింగంపల్లి యువత లో మంచి పట్టు ఉంది.


     చివరగా  మొవ్వ పాత టిడిపి  మిత్రుడు బండి రమేష్ చేరికతో గ్రేటర్ ఎన్నికలకు ముందు టి ఆర్ ఎస్ పార్టీ మరింత బలపడింది

ఫిబ్రవరి 5 వరకు వేచి చుస్తే కాని తెలియదు TRS బలపడింది లేనిది.