జిహెచ్ఎంసి మేయర్ ఎన్నికలో ఏక్స్ ఆఫిషియో సబ్యుల వోట్లు కీలకం కానున్నాయా ?

     
JAN-24-2016:

           జిహెచ్ఎంసి  మేయర్  ఎన్నికలో  ఏక్స్ ఆఫిషియో  సబ్యుల వోట్లు కీలకం కానున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి రాజకీయ నాయకులు మరియు విశ్లేషకుల నుండి. ఎన్నికలకు కేవలం ఇంక ఒక్కటే వారం మిగిలి ఉండగా అన్ని రాజకీయ పార్టిలు ప్రచారాన్ని ఉదృతం చేసాయి . ఈసారి జిహెచ్ఎంసి  ఏంటో ఉదృతంగా జరుగుతున్నాయి అదికార టిఅర్ఎస్ పార్టీ తమ సత్తా చాటాలని బావిస్తుండగా టి డి పి మరియు బి జె పి మేయర్ పీతాన్ని కైవసం చేసుకొని తమ బలాన్ని చాటాలని ఉవ్వుల్లుతురుతున్నాయి . ఇక ఎంఐఎం కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి .


                  అన్ని పార్టీల బలాబలాలను పరిశీలించాక ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికలలో ఏ పార్టీకి కూడా మేయర్ పీటాన్ని దక్కించుకోవడానికి సరిపడా సీట్లు దక్కకపోవచ్చు అన్న అభిప్రాయం వెలువడుతుంది . కాగా అదికార టిఅర్ఎస్ తరపున అన్ని తానే అయి వ్యవహరిస్తున్న కెటిఅర్ మాత్రం టిఅర్ఎస్ పార్టీ తప్పనిసరిగా మేయర్ సీటును కైవసం చేసుకుంటాం లేని ఎడల తన మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించాడు . ఈ ఛాలెంజ్ లోని ఆంతర్యం ఏమిటి అని ఆలోచించగా టిఅర్ఎస్ పార్టీకి ఏక్స్ ఆఫిషియో  సబ్యుల బలం ఉండడంతో  కెటిఅర్ దైర్యంగా ఓపెన్ ఛాలెంజ్ చేసాడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .


                జిహెచ్ఎంసి పరిదిలో ఉన్న అందరు ప్రజప్రథినిదులకు మేయర్ ఎన్నికలో ఏక్స్ ఆఫిషియో వోట్ ఉండడం జరుగుతుంది. జిహెచ్ఎంసి పరిది హైదరాబాద్ జిల్లా  పూర్తిగా  మరియు  రంగారెడ్డి ,మెదక్ , నల్గొండ జిల్లాలో కొంత బాగం విస్తరించి ఉంది . ఆయా పరిధిలోని ప్రజా ప్రతినిడులందరిలో మిగతా పార్టీలతో పోలిస్తే టిఅర్ఎస్ పార్టీకి బారీ మెజారిటీ ఉంది .ఎంఎల్ఏ , ఎంపి - లోక్ సభ ,ఎంపి - రాజ్యసభ,ఎంఎల్సి సభ్యులకు ఈ వోటు హక్కు ఉంటుంది . కాగా  టిఅర్ఎస్ పార్టీకి మండలిలో ఉన్న మెజారిటీ సభ్యుల వల్ల మేయర్ కుర్చీని కైవసం చేసుకోవడం సులభం అవుతుంది అని ఆ పార్టీ వర్గాల సమాచారం. అంతేకాక టిడిపి నుంచి పార్టీలో చేరిన గ్రేటర్ పరిధిలోని నలుగురు శాసనసభ్యులు , కాంగ్రెస్ నుండి చేరిన మండలి సబ్యులు కూడా టిఅర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం.