Telangana Government Announces New Gram Panchayat Villages

గిరిజన తండాలను  గ్రామ పంచాయితులనుగా  ప్రకటించిన తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని ఎంతోమంది గిరిజనులు అండోత్సహాల్తో హర్షాతిరేకులతో స్వాగతిస్తున్నారు . మా పాలన మాదే అన్న తెలంగాణ నినాదంలో భాగమే ఈ  పంచాయితుల ఏర్పాటు గ భావిస్తున్నారు . ప్రతి గ్రామా పంచాయితులలో మెలిక సదుపాయాల కల్పనకు కొంత సమయం పట్టిన అతి త్వరలో ఈ జరిగన తండాలు అన్ని కూడా స్వయం పాలనతో అభివృద్ధిలో దూసుకుపోతాయి అన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. గిరిజనుల జీవన విధానాల్లో మార్పును కోరుకుంటున్న వాళ్ళ అందరు ఎన్నో రోజులనుండీ వేచి చూస్తున్న నిర్ణయం ఇది అనే చెప్పుకోవాలి. గిరిజనులు ఇప్పుడు ఉన్న పంచాయితీల్లో కూడా చాల వరకు సర్పంచులుగా ఉన్న కూడా వాళ్ళు కేవలం నామమాత్రపు సర్పచుల్లానే మిగిలారు , ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా గ్రామంలోని ఉన్నత కులస్తుల చెప్పు చేథల్లోనే ఉన్నాయని చెప్పుకోవాలి .





   కొత్త   గ్రామా పంచాయితులతో ఎంతో కొంత మేలై తే జరుగుతుంది అని భావించిన కూడా వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం  బాల్యంలో బడుల్లో చదువుకోవాల్సిన  పిల్లల్ని కూలీగా మార్చే ఎంతో మంది గిరిజనుల ఆర్థిక స్థితి గతులు పూర్తిగా కొన్ని మాసాల్లో మారుతాయంటే అతిశయోక్తే.  గిరిజనుల్లో ఈ పాటికే ప్రతి తాండాలో ఒక్కరో ఇద్దరో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు అయినా కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎంత మంది తమ పిల్లల్ని చదివిస్తున్నారు అంటే వేళ్ళమీద లెక్క పెట్టొచ్చు . గిరిజన యువకులంతా కూడా కలిసి కట్టుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది రాజకీయంగా మరియు మౌలిక సదుపాయాల్లో ఎంతో కొంత అభివ్రుది చెందుతున్నాకూడా వారి కోసం రాజ్యంగంలో కేటాయించిన రిజర్వేషన్స్ యొక్క ప్రాముఖ్యాన్ని వివరించాల్సిన అవసరం ఉంది . బాల బాలికలను కూలీలుగా మార్చే తమ తోటి తండా వాసులను చదువుకుంటే ఎలాంటి ఉన్నత అవకాశాలు తమ కోసం వేచి చూస్తున్నాయి చెప్పాలి .


     డాక్టర్ బి ఆర్  అంబేద్కర్ రాజ్యంగంలో కల్పిచిన హక్కులను కేవలం గిరిజనుల్లో అభివృద్ధి చెందిన కొన్ని కుటుంబాలే విరివిగా  వాడుకుంటున్న ఈ తరుణంలో ప్రతి పేద గిరిజనుడికి కూడా తమ పిల్లల భవిష్యత్తును చదువు అనే ఆయుధం ద్వారా ఎలా మార్చుకోవచ్చో అదే గ్రామంలో ఉన్న చదువుకున్న యువకులు వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉంది . ప్రభుత్వాలు ఎన్ని పతకాలతో ముందుకు వచ్చిన ఎన్ని సబ్ ప్లాన్స్ పెట్టిన బడ్జెట్ లో ఎన్ని నిధులు పెట్టినా  మార్పు కేవలం సమాజంలోని ఒకరికి ఒకరు చేయిచేయి అందించుకొని మనంతట మనమే సాధించుకోవాలి . అతి త్వరలో బాల్య వివాహాలను అరికట్టి బాల కార్మికులను ప్రభుత్వ పాఠశాలల్లో చెర్పిచడానికి మనమందరం పూనుకోవాల్సిన అవసరం ఇంటిని ఉంది . కనీసం వచ్చే జనరేషన్ గిరిజనులు మల్లి ఇవే బాధలు పడకుండా ఉంటారని భావిద్దాం .

DATE: 31-MAR-2018