తెలంగాణ ఎన్నికలు : తొమ్మిది ప్రశ్నలు

తెలంగాణ ఎన్నికలు : తొమ్మిది ప్రశ్నలు 

ప్రజకూటమి వల్ల నష్టం ఎవరికీ జరిగింది ?

అతి పెద్ద పరాజయం తెలంగాణ ఉద్యమంలో మరియు రాష్ట్ర సాధనలో  కె సి ఆర్  ,  టి ఆర్ ఎస్  పార్టీతో సమానంగా జె ఏ సి తో పాటు తన పాత్ర ఉందని భావించిన కోదండరాం సారుకి జరిగింది.  ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేసి కనీసం ఎన్నో కొన్ని ఓట్లు సాధించినా ఒక గౌరవ ప్రదమైన రాజకీయ పార్టీగా మరియు ఎప్పటికి అదే ఉద్యమం నాటి  గౌరవమైన తెలంగాణ వాడిగా  ఉండేది తెలంగాణ ప్రజల్లో.

ముందస్తు ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం ఏంటి ?

కాంగ్రెస్ పార్టీ  గెలిచి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆ పార్టీ క్యాడర్ కి కూడా కొన్ని నెలల ముందు వరకు కూడా లేదు  కానీ  రేవంత్ రెడ్డి లాంటి ఫ్యూచర్ ఉన్న మాస్ లీడర్ ఓడిపోవడం మరియు ఉద్దండులు డి కె అరుణ , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , జానా రెడ్డి మరియు  ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతి ల ఓటమి.


ముందస్తు ఎన్నికల వల్లతెలుగు దేశం  పార్టీకి జరిగిన నష్టం ఏంటి ?

తెలుగు దేశం ఒంటరిగా పోటీచేస్తే కనీసం ఇప్పుడు గెలిచిన రెండు స్థానాలు కూడా గెలిచివుండక పొయ్యేదేమో . కూటమిలో చేరడం వల్ల ఖమ్మంలో ప్రజకూటమి అభ్యర్థుల విజయానికి ఎంతో కొంత తోడ్పడింది మరియు హైదరాబాద్ లో  మాహేశ్వరం మరియు ఎల్ బి నగర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి కూడా తోడ్పడింది అని చెప్పుకోవాలి.


ప్రజకూటమి వల్ల నష్టం ఎవరికీ జరిగింది ?

టి ఆర్ ఎస్ పార్టీకి ఖమ్మంలో కేవలం ఒకే ఒక్క స్థానం రావాడానికి మరియు మినిస్టర్ తుమ్మల ఓడిపోవడానికి కూడా ప్రజకూటమి ప్రభావం చాల వరకు ఉందనే చెప్పాలి .

ముందస్తు ఎన్నికల వాళ్ళ తెలంగాణ ప్రజలకు జరిగిన లాభం ఏంటి  ?

టి ఆర్ ఎస్ పార్టీ గెలుపు ఎంతో సులువు అని మరియు వందకు పైగా స్థానాల్లో విజయం సాధించొచ్చు పెద్దగా కొత్త పాతకలేవీ ప్రవేశపెట్టకుండానే విజయం సాధించొచ్చు అనుకుంది . కానీ ప్రజకూటమి వల్ల మరియు సోషల్ మీడియా మరియు ప్రజకూటమి అనుకూల మీడియాల వల్ల టి ఆర్ ఎస్ పార్టీ ప్రజలు జనాకర్షక పథకాలతో కూటమి వైపు మళ్లుతారేమో అని ప్రజారంజక పతకాలు అయినా అన్ని రకాల పింఛన్ల  రెట్టింపు , రైతు రుణమాఫీ , నిరుద్యోగ భృతి సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణాకి ప్రభుత్వ సహాయం లాంటి పథకాలతో పేద ప్రజలకు చాలా వరకు ప్రయోజనమే.


ప్రజా తీర్పు వల్ల ఏమి స్పష్టం అవుతుంది ?

ప్రజలు స్థిరమైన ప్రభుత్వాలను కోరుకుంటున్నారు , పార్టీ కన్నా మరియు ఎం ఎల్ ఏ అభ్యర్థికన్నా కూడా స్టేట్  లీడర్ ముఖ్యం అని చాటి చెప్పారు .  కె సి ఆర్ ప్రవేశపెట్టిన పతకాల వల్ల ఉపయోగం ఉందని భావించారు. తెలంగాణ పార్టీల వల్లనే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడబడతాయి అని తెలిపారు. ఆంధ్ర మరియు ఢిల్లీ పెత్తనాన్ని తిరస్కరించారు .

తెలంగాణ ఎన్నికల్లో  జోక్యం వల్ల  ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు కి నష్టమా లాభమా ?

ఓటమి ఎప్పటికైనా తెచ్చేది నష్టమే మరియు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులంతా తెలంగాణాలో ప్రజకూటమి ఓటమికి పని చేశారనే చెప్పుకోవాలి . కానీ పవన్ కళ్యాణ్ మరియు జగన్ ఒంటరిగా ఎన్నోకల్లో పోటీ చేస్తే మాత్రం చంద్రబాబు కి వ్యతిరేక ఓటు చీలిపోయ్యి మల్లి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతో కొంత ఉంటాయి.

తెలంగాణాలో ఇంకా సెటిలర్స్ అనే పదాన్ని వాడడం సరి అయినదేనా ?

హైదరాబాద్ మున్సిపాలిటీ మరియు ఇప్పటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక సెటిలర్స్ అనే పదానికి స్వస్తి చెప్పడమే మేలు అని చెప్పుకోవాలి .

ప్రజకూటమి ప్రచారం చేసిన విపరీతమైన అప్పులు మరియు నిరుద్యోగ సమస్య ప్రభావం ఎందుకు లేదు ?

సామాన్య ప్రజలకు సంక్షేమ పతకాల వల్ల కలిగే ప్రయోజనాల కన్నా రాష్ట్ర బడ్జెట్తో పెద్దగా సంబంధం లేదనే చెప్పారు ఓటర్లు . మరియు అప్పులు తిరిగి కట్టే స్థోమత ఉన్నవాళ్లకే ఇచ్చే వాళ్లు ఇస్తారని సగటు మనిషి అభిప్రాయం.


DATE: 12-DEC-2018