తెలంగాణ ప్రభుత్వ రైతు బందు పథకం


తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  రైతు బందు పతకం సందర్భంగా మా మాట :


రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో దైర్యంతో ఈ సంవత్సరం మొదటిరోజే 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే మరి విద్ద్యుత్తు ఒక్కటే ఇచ్చి రైతులకు మేము అంతా  చేసేసాం అని ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. ఇంకా రైతులకు ఎదో చెయ్యాలనే తపనతో  మల్లి ఒక కొత్త పథకంతో  ప్రజల ముందుకు వచ్చింది . ఈసారి  దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అమలులో లేని పథకం, రైతుకు పంట వెయ్యక ముందే పెట్టుబడికి డబ్బు రూపేణా సహాయం చెయ్యాలని అలోచించి ప్రకటించిన కొన్ని నెలల్లోనే కార్యరూపం దాల్చి ఇవాళ రైతులకు  నేరుగా వారి గ్రామాలకు అధికారులు వెళ్లి చెక్కులు మరియు కొత్త పాస్ బొక్కులు ఇవ్వడమేది చాల అభినందనీయం . 
                        రైతు బిడ్డలుగా రైతులు పడే బాధలు ఎంతో కొంత తెలిసిన మలితరం యువత కేవలం నగరాల్లో చాలీ చాలని ఉద్యోగాలతో జీవితాన్ని సాగదీయకుండా మల్లి గ్రామాల  బాటని పట్టి వ్యవసాయం కూడా ఒక లాభసాటి వృత్తి అని భావిస్తారని ఆశిద్దాం . ఇలాంటి కారక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు ఎవరైనా వారి వారి ప్రభుత్వాలకు మంచి పేరు రావాలని మరియు పది మందివారి పాలనా మరియు ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలని ప్రభుత్వ పెద్దలు అనుకోవడంలో తప్పు ఏమి లేదు కానీ ప్రభుత్వ ఖజానా సొమ్ముతో ఒకసారి దేశమంతటా 24 గంటల ఉచిత విద్ద్యుత్తు గురించి పత్రికా ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం మల్లి ఇప్పుడు రైతు బంధు పతాకం గురించి కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో  ప్రకటనలు ఇవ్వడం కొంచెం ఖండించదగ్గ  విషయమే.  రైతులకు జూన్ మాసం నుండి ప్రమాద వశాత్తు చనిపోతే  భీమా కూడా ప్రకటించిన ప్రభుత్వం ఇక చివరగా వారి కోసం చెయ్యాల్సింది పెండింగులో  ఉన్న నీటి పారుదల  ప్రాజెక్టులను పూర్తి చెయ్యడం , పండిన పంటకు మద్దతు ధరను కల్పించడం మరియు ఆరోగ్య భీమాను కల్పిస్తే రైతులు అప్పుల ఊబిలోనుంచి బయటకు వచ్చే సమయం మరి ఎంతో దూరంలో లేదు అని అనిపిస్తుంది . లక్షా డెబ్భై అయిదు వేళా కోట్ల రూపాయల బుడ్జెలో ఈ పథకం కోసం  పన్నెండు వేల కోట్ల రూపాయలను కేటాయించి సంవత్సరానికి  ప్రతి  ఎకరాకు ఎనిమిది వేలు రెండు విడతలుగా ఇవ్వడం సన్నకారు రైతుకు ఎంతో మేలు చేసే విషయం  . 


                  సోషల్ మీడియాని   కేవలం సెటైర్లు వెయ్యడానికో లేదంటే కామెడీ వీడియోస్ షేర్ చేయడానికో ఎక్కువ శాతం ఉపయోగిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి మంచి పథకాలను అభినందించడానికి అందరు కలిసి ముందుకు రావాలి.  ప్రభుత్వ అధికారులని మరియు టి ఆర్ ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ ని మనస్ఫూర్తిగా అభినందిద్దాం మరిన్ని ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం . DATE: 10-MAY-2018