రేవంత్ రెడ్డి చెప్పిన చింతమడక సర్పంచ్ కథ

ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ప్రతి సంవత్సరం నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు  సందర్బంగా ఈ రోజు విశాఖపట్టణంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కెసిఆర్ ఇచ్చిన ఎలక్షన్ హామీల అమలుపై  మాట్లాడుతూ చాలా చక్కగా ఒక పిట్టా కథ ద్వారా వివరించాడు.  





     


కెసిఆర్ స్వంత గ్రామం చింతమడకలో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంట అక్కడ తెరాస పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి ఈసారికి నన్ను గెలిపించండి ఇన్ని సార్లు మిగతా పార్టీలను గెలిపించారు ఈసారి నన్ను గెలిపిస్తే ఊరి బయట ఉన్న కొండను తీసి నా భూజం మీద మోస్తా అన్నాడు అంట , ఊర్లో ప్రజలు కూడా అలోచించి  అందరికి ఇన్ని రోజులు ఓట్లు వేషం కదా ఈ గమ్మత్తి కూడా ఏందో చూద్దాం కొండను  మోస్తా అంటున్నాడు కదా అని  తెరాస అభ్యర్థికి వేద్దాం అని ఓట్లు వేసి గెలిపించారు , తెరాస అభర్థే ఎన్నిక గెలిచాడు.  ప్రజలు సాయంత్రం అందరు కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్లారు కొండను మోస్తా అన్నావ్ కదా వెళ్దాం పద మొద్దువు మరి అని , సర్పంచ్ ఇవాళ సాయంత్రం అయ్యింది కదా ఇవాళ వద్దు రేపు పొద్దున్న మోస్తా అని అందరిని పంపాడు అంట. మల్లి పొద్దున్న ప్రజలు అంత కూడా కలిసి కొండా దగ్గరికి చేరుకున్నారు సర్పంచ్ కూడా చక్కగా తయారు అయ్యి వచ్చాడు అంట , మరి ప్రజలు ఎత్తు కొండని అన్నప్పుడు  మీరు లేపి నా బుజం మొడ్డ పెట్టండి నేను మోస్తా అన్నాడు అంట సర్పంచ్ తెలివిగా నేను కేవలం కొండని మోస్తా అన్న ఎత్తుకుంటా అని చెప్పలేదు అన్నాడు అంట.  




 ఈ కథను కెసిఆర్ ఇచ్చిన మైనారిటీలకు రిజర్వేషన్స్ మరియు గిరిజనులకు రిజర్వేషన్స్ కి అన్వయిస్తూ మోడీ రాజ్యాంగ సవరణ చేస్తేనే నేను ఇవ్వగలుగుతా అంటున్న కెసిఆర్ తీరుని వివరంచడానికి చాల చక్కగా చెప్పిన విధానం సభికులు అందరిని ఆకట్టున్నది . 



DATE: 29-May-2017